Swachadanamm Pachadanam Program : హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని మేయర్ విజయలక్ష్మీ అన్నారు. ప్రజలు ఇంకా చెత్త పారవేత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారికి వేయి రూపాయలు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.