CM Chandrababu Phone Call to Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రంలో వరద సహాయ చర్యలను వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లను రాష్ట్రానికి పంపాలని సీఎం కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ఫోన్ సంభాషణ తర్వాత వరద ప్రభావంపై విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ధైర్యం నింపి పరిస్థితి సద్దుమణిగే వరకు కలెక్టర్ కార్యాలయం నుంచే పాలన సాగిస్తానని సీఎం స్పష్టం చేశారు.