Chandrababu 30 Years Milestone as CM : రాజకీయం అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనమని ఆయన నిరూపించారు. సాధారణమైన జీవితాన్ని గడుపుతూ అసాధారణమైన ఆలోచనలు చేస్తూ అందర్నీ రాష్ట్రం వైపు చూసేలా చేశారు. తన విజన్‌కు సాంకేతికత జోడించి యువత జీవితాల్లో మార్పులు తెచ్చారు. దేశవిదేశాల్లో తెలుగువారి సత్తాచాటేలా చేశారు. ఇంట్లో ఉన్న మహిళలను ఆర్థికశక్తిగా మార్చారు. ఆయన ఎవరో కాదు రాజకీయాల్లో అవిశ్రాంత పోరాటయోధుడు చంద్రబాబు నాయుడు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం