PM Modi Inaugurated Juvvaladinne Fishing Harbor: ప్రధాని మోదీ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా మత్స్యకారులు వీక్షించారు. చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.