Government Installs Transponders on Fishermen Boats : మత్స్యకారుల జీవితంలో ప్రత్రి ఎన్నో సవాళ్లు. సముద్రంలోకి వెళ్లకపోతే భవిష్యత్తేంటన్న సవాలు. వెళ్తే వాతావరణంతో సవాలు. వల వేసి చేపలు పట్టడం సవాలు. ఒడ్డుకి తెచ్చాక సరైన ధరకు అమ్ముకోవడం సవాలు. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు జీవన పోరాటం సాగిస్తున్నారు. ఇక చాలా సందర్భాల్లో వారు వేటకు వెళ్తే, కల్లోల కడలిలో చిక్కుకుపోతుంటే, వారి ఆచూకీ లభించడం కష్టమవుతోంది. ఇవన్నీ ఆలోచించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం.