Minister Achchennaidu Review on Fisheries Department: గత తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో మత్స్యశాఖపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి అంశంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.