FISHING HARBOUR AT KOTHAPATNAM: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2019కి ముందే ఓడరేవు నిర్మాణ ప్రతిపాదన ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదన మళ్లీ కార్యరూపం దాల్చింది. కె.పల్లెపాలెం వద్ద ఓడరేవు నిర్మాణం జరగనుంది. అయితే హార్బర్ వల్ల లాభనష్టాలపై తమకు అవగాహన కల్పించాకే ముందడుగు వేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.