Chandrababu Speach In Telugu Language Day: మాతృభాషను మరిచిపోతే జాతి కనుమరుగు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. జీవో నెంబరు 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.