Venkaiah Naidu Participated in Telugu Language Day Celebrations : తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇక నుంచి తెలుగు వారందరూ మాతృభాషలోనే మాట్లాడుతామనే ప్రతిన తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులోనే ఉండే విధంగా చూసుకోవాలనీ కోరారు. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు సైతం తెలుగులోనే ఉండాలనీ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసిన తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్కొన్నారు.