Prapancha Telugu Mahasabhalu : It's Telugus Pride!

  • 6 years ago
NTR is known as Telugus Pride. He has done a lot for the Telugu Language and people across the World respect him for his invaluable contribution even now.

ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...కవిరత్న చింతల శ్రీనివాస్ ఐ.ఏ.ఎస్., మాట్లాడుతూ జరుగుతున్న ఈ సంబరాలు ప్రపంచానికే తలమానికంగా నిలిచే విధంగా వున్నాయి అంటు తోటి కళాకారుల మధ్య వేదికని పంచుకోవటంలో ఉన్నా సంతోషాన్ని వ్యక్తంచేశారు.
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.

Recommended