CPI Narayana Visit N Convention : సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని తెలిపారు. చెరువులు కబ్జా చెయ్యడం వల్ల హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వర్షం పడితే చాలు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు.