Foreign Medical Students Concern : విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన రాష్ట్ర విద్యార్ధుల పరిస్థితి అయోమయంగా మారింది. నిబంధనల ప్రకారం ఏడాది పాటు హౌస్ సర్జన్లుగా విధులు నిర్వర్తించిన పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవటంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీంతో డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న, ఏపీఎంసీ అధికారులు మాట దాటేసే థోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.