APPSC Experts Committee Proposals : ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో తీసుకోవాల్సిన మార్పులపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నిపుణుల కమిటీ పలు కీలక ప్రతిపాదనలను రూపొందించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేయాలని సిఫార్సు చేయనుంది. మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని, ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల ఎంపికకు సెర్చ్ కమిటీ ఏర్పాటు, 6 గ్రూపులుగా ఉద్యోగాల విభజన తదితర కీలక అంశాలను సిఫార్సు చేయనుంది.