TASK Skill Training Program : దేశంలో నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మంచి మార్కులు సాధించినా భావవ్యక్తీకరణ నైపుణ్యం లేక ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో టాస్క్ పనిచేస్తుంది. ఎంతో మందికి శిక్షణ ఇస్తూ యువ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను చూపిస్తుంది.