HYD METRO PHASE 2 ALIGNMENT : హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ విస్తరణ సవాల్‌గా మారబోతుంది. ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాల్లో జాతీయ రహదారులపై ఇప్పటికే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించగా కొత్తగా మరికొన్ని పైఓవర్ల నిర్మాణం సాగుతోంది. ఈక్రమంలో మెట్రోరైలు రెండోదశ కారిడార్‌లో ఎదురయ్యే సవాళ్లపై ఇంజినీరింగ్ అధికారులు, జాతీయ రహదారుల అధికారులతో సమీక్షించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ కారిడార్‌లోని మార్గాలను రెండురోజులు పరిశీలించి మెట్రో అలైన్‌మెంట్‌పై నిర్ణయాలు తీసుకున్నారు.