Government 100 Days Action Plan Eradicate Ganja from AP: గంజాయి సాగు, అక్రమ రవాణాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ మొదలు పెట్టిన ఎన్డీయే కూటమి సర్కారు మంత్రుల కమిటీని నియమించింది. సచివాలయంలో తొలిసారి భేటీ అయిన ఈ మంత్రుల కమిటీ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు అమాయక గిరిజనులపై బనాయించిన గంజాయి కేసులపై న్యాయపరమైన సాయాన్ని అందించే విషయంపై చర్చించింది.