టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం కోరుకొనే వారు పేపర్ లెస్ గా యాప్స్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు.100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.