Preethi Sri of Kadapa Kuchipudi Dancer Enters Gunnies Book of Records : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సృజనాత్మక కళ ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించే వారుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే చేశారు ఆ తల్లిదండ్రులు. చిన్నతనంలోనే కుమార్తెలో నైపుణ్యాలు పసిగట్టి నటరాజ కళాక్షేత్రంలో చేర్చారు. అలా కూచిపూడి నృత్యంలో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభను కనబర్చడమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 200పైగానే ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు అందుకుంటోన్న ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.