Keerthana Inspirational Story : అంగవైకల్యంతో అవస్థలు. ఆర్థిక సమస్యలు. అడుగడుగునా అవమానాలు. ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవరోధాలు ఇవేవీ లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా అక్షర యజ్ఞం చేసిందీ ఆ ఆమ్మాయి. వైకల్యం వెంటాడుతున్నా విజయం వైపు వడివడిగా అడుగేసింది. ఏపీ ఇంటర్ ఫలితాల్లో 902 మార్కులతో పాటు, ప్రత్యేక అవసరాల పిల్లల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో షైనింగ్ స్టార్ అవార్డుతోపాటు ప్రశంసలు అందుకుంది.