PAWAN KALYAN COMMENTS AT PANCHAYAT RAJ DAY: గ్రామాలు స్వయంప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పంచాయతీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లు పవన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం స్టాళ్లను పరిశీలించిన పవన్ కల్యాణ్, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై ఫొటో ప్రదర్శన తిలకించారు. ఉగ్రదాడి మృతులకు పవన్ కల్యాణ్, అధికారులు సంతాపం తెలిపారు.