Bolero Vehicle With Coconut Load Met With Accident : కొబ్బరికాయలతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బొలెరోలోని కొబ్బరికాయలన్నీ కిందపడిపోయాయి. అటుగా వెళ్తున్న వారు వాటిని సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు, వర్ధన్నపేట మున్సిపాలిటీ శివారులో కొబ్బరికాయల లోడుతో ఉన్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ పక్కన నిలిపాడు. అటువైపుగా వస్తున్న లారీ అదుపు తప్పి వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న కొబ్బరికాయలన్నీ కిందపడిపోగా, స్థానికులు వాటిని సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.