Eagle Chief RK Ravikrishna On Drug Free Andhra Pradesh : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగునంగా ఈగల్ సెల్ నిర్విరామంగా పనిచేస్తోందని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల బారిన పడి జీవితాలను పాడు చేసుకోకుండా యువతకు అవగాహన కల్పిస్తూనే, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు విస్తృత కార్యచరణ రూపొందించామని చెప్పారు. ఇప్పటికే ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు. మరోవైపు పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నమని ఐజీ రవికృష్ణ స్పష్టం చేశారు.