Gottipati on Reliance CBG Plant : ప్రకాశం జిల్లా దివాకరపురంలో రిలయన్స్ సంస్థ తొలి సీబీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి ఏప్రిల్ 2న మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతంతో పాటు హెలిప్యాడ్, సభా వేదికను పరిశీలించి పలు సూచనలు చేశారు.