Govt Employ Drain Cleaning Plantation in Anantapur District : ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. పర్యావరణం, పరిసరాల శుభ్రత అంటే అందరికంటే ముందుంటాడు. ఆరేళ్లక్రితం మెుదలు పెట్టిన స్వచ్ఛత ఉద్యమం నేటికీ కొనసాగిస్తున్నారు. ఓ కాలనీని దత్తత తీసుకొని స్వచ్ఛత సేవతో పాటు మెుక్కలు పెంచుతున్నారు. అనంతపురం జిల్లా వినియోగదారుల కౌన్సిల్లో కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య, ఉద్యానవనాల కార్మికుల కంటే మిన్నగా సేవలందిస్తూ స్థానికుల అభిమానం చురగొంటున్నారు