Government Completed Pedavadlapudi Lift Irrigation Project : గత వైఎస్సార్సీపీ పాలనలో పోలవరం, అమరావతి వంటి పెద్ద ప్రాజెక్టులే కాదు చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలు కూడా పడకేశాయి. గుంటూరు జిల్లా పరిధిలో 26వేల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించే లక్ష్యంతో ప్రారంభమైన పెదవడ్లపూడి లిఫ్ట్ పనులు కూడా జగన్ జమానాలో నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేశ్ చొరవతో ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.