Playing Poker in Lorry: విజయనగరంలో లారీలో పేకాడుతూ డ్రోన్ కెమెరా ద్వారా పలువురు పోలీసులకు దొరికిపోయారు. ఇది విజిబుల్ పోలీసింగ్-ఇన్విజిబుల్ పోలీస్ అన్న నినాదానికి అర్థం చెప్పిన ఘటన అని. హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్టు చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు.