Manduva Logili Traditional Houses in Godavari Districts : ఉమ్మడి గోదావరి జిల్లాలు మండువా లోగిళ్లకు పెట్టింది పేరు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ లోగిళ్లలోని ప్రతి వస్తువుకూ ఓ చరిత్ర ఉంది. నిర్వహణ భారంగా మారడంతో కొన్ని కనుమరుగవుతున్నా, తాత ముత్తాతల కాలంనాటి వస్తువులను పలువురు పదిలంగా భద్రపరుస్తున్నారు. పాత వస్తువులను విక్రయించే వ్యాపారులు వీటిని సేకరించి కొత్త సొబగులు అద్దుతున్నారు. అలనాటి వస్తువులకు ఉన్న విలువ, వాటి ప్రాముఖ్యత తెలిసిన పలువురు వీనిటి కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు.