మహిళా భద్రతపై పోలీసు శాఖ ఎక్కువ దృష్టి పెట్టిందని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. అందుకోసం ఇప్పటి వరకు ఉన్నఉమెన్ ప్రొటెక్షన్ సెల్ స్థానంలో ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. 164 శక్తి టీమ్స్‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మిస్సింగ్ చైల్డ్ గురించీ శక్తి యాప్ ద్వారా పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా తగ్గిందన్న డీజీపీ, 11 వేల ఎకరాల్లో గంజాయి సాగును నిర్వీర్యం చేశామని తెలిపారు.