Dwaraka Tirumala Rao Retirement as DGP in AP : పోలీస్ ఆఫీసర్గా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీసును ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడిచేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు.