THIEVES FIRED GUNS IN CHITTOOR: చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది. సుమారు రెండున్నర గంటలపాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.