Major Bridges Construction Stalled in Srikakulam: గత కొన్నేళ్లుగా వంతెనల నిర్మాణాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణాలు నిలిచిపోవడంతో వందలాది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వంతెనల నిర్మాణాలు 50 శాతంపైగా పూర్తయినా.... ఐదేళ్లలో వైసీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వంతెనలను పూర్తిచేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.