NTR Trust Euphoria Musical Night Show in Vijayawada : తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా ప్రజల గుండెల్లో పథిలంగా ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు తన వంతుగా 50లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. త్వరలోనే నారా భువనేశ్వరికి అందజేయనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.