GHMC Mayor Falls Down on Footpath : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతుండగా కాలు స్లిప్ అవడంతో ఫుట్‌పాత్‌పై కింద పడిపోయారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పలు సుందరీకరణ పనుల ప్రారంభోత్సవంలో హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మేయర్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.