AP Male DWCRA Groups 2025 : మహిళల ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా గతంలో టీడీపీ సర్కార్ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి విస్తృతం చేసింది. ఇదే ఒరవడితో పురుషులకూ స్వయం ఉపాధికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకూ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని అమలు చేస్తోంది. తొలుత పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపడుతుండగా భవిష్యత్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయనుంది.