Due to YSRCP Negligence Ongole GGH in Bad Condition : వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల పాలిట కూడా శాపంగా మారింది. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రే దానికి నిదర్శనం. ఆసుపత్రిలోని బెడ్షీట్లు, దుప్పట్లు ఉతికే లాండ్రీ యంత్రాలు నాలుగేళ్ల క్రితం పాడైపోయినా వైఎస్సార్సీపీ పట్టించుకోలేదు. ఫలితంగా బెడ్షీట్లు, దుప్పట్లు ప్రైవేటు లాండ్రీల్లో ఉతికిస్తున్నారు. దీంతో ఆసుపత్రిపై ఆర్థిక భారం ఎక్కువైంది.