Cyber Crime Six People Arrested: కంబోడియాలో ట్రైనింగ్ తీసుకుని, విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, తొలుత 10 రోజుల క్రితం రాజమండ్రికి చెందిన అరుణ్ కుమార్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.