Cyber Crimes in Hyderabad : జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్ పని చేయడం లేదని, డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు.