Vijayawada Police Commissioner on Annual Crime Review Meeting -2024 : 2024 సంవత్సరంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని విజయవాడ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గిందన్నారు. అయితే గతంలో కంటే హత్యాయత్నం కేసులు పెరిగాయని, కేవలం ఆరు నెలల కాలంలోనే 92 హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వార్షిక నేర సమీక్ష సమావేశం -2024 నిర్వహించారు.