Hyderabad Rains 2024 : రెండు రోజుల పాటు తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. కాలనీలు జలమయమై, రోడ్లపై వరద పొంగుతుండగా, హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్ విపత్తు నిర్వహణ సంస్థ - హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘట్కేసర్లో విద్యుత్ షాక్‌తో ఒకరు, షాద్‌నగర్‌లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ అనుదీప్, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.