Telangana Exhibitors Association Welcome Telangana Govt Decision : సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల రాష్ట్రంలో థియేటర్లు మరో ఐదేళ్లు ఊపిరిపోసుకుంటాయని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా టికెట్ ధరల తగ్గింపుతో పాటు బెనిఫిట్ షోల రద్దుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కోరనున్నట్లు ఏపీ ఎగ్జిబిటర్లు తెలిపారు.