BJP Leaders Reactions on Telangana Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏం చేస్తుంది, ఎన్ని నిధులు కేటాయించారో చెప్పకుండా తమ గొప్పలు చెప్పుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం సాగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. భట్టి విక్రమార్క బడ్జెట్ అంతా అభూత కల్పన, అంకెల గారడి, ఆర్భాటం తప్ప అందులో ఏమీ లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే ఉందని విమర్శించారు. ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయానికి బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదన్న ఆయన పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు.