Minister Anagani Satya Prasad in Revenue Conference For Land Issues : రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్‌పెట్టేలా రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మీ భూమి- మీ హక్కు’ పేరిట రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసి వివాదాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 60శాతం భూములు, రిజిస్ట్రేషన్లకు సంబంధించినవేనన్న ఆయన వాటిని ఎక్కడిక్కకడ పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.