CM Along With Power Minister Manohar Lal Khattar Attend Urjaveer Program : దేశ, రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గృహోపకరణాల నుంచి వాహనాల వరకు అన్నీ ఎలక్ట్రికల్‌గా మారబోతున్నాయని, రాష్టంలో ప్రతీ 30 కిలోమీటర్లక ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడతామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేస్తామని, రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు.