New Drug Formula to Prevent Heart Attacks Uses : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగాయి. కరోనా తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు దిల్లీ ఎయిమ్స్ సర్వేలో వెల్లడైంది. నిద్రలో ఉండగానే వేకువజామున సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తున్నారు. వేకువజామున వచ్చే గుండెపోటు నివారణకు కొత్త విధానాలు రావాల్సిన అవసరాన్ని చాటిచెబుతూ బాపట్ల ఫార్మసీ కళాశాలకు చెందిన ముగ్గురు పరిశోధకులు సమయ నిర్దేశిత ఔషధ విధానంపై పరిశోధనలు చేసి పేటెంట్ పొందారు.ఇంతకీ గుండెపోటు నివారణకు ఈ విధానం ఎలా ఉపకరిస్తుంది? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది? వంటి అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం.