Brain Stroke Symptoms : ఉన్నట్టుండి కంటిచూపు కోల్పోతున్నారా? అదుపు తప్పి పడిపోతున్నారా? అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? ఐతే, తస్మాత్ జాగ్రత్త! అది స్ట్రోక్ లక్షణం కావొచ్చు. శరీరంలోని ఓ చేయి బలహీనం అవ్వడం, అడుగు తీసి అడుగు వేసేందుకు కాళ్లు సహకరించకపోవటం లాంటివి స్ట్రోక్ లక్షణాలే. అలా అని అదేదో గుండెపోటు కాదు. దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్! దీని బారిన ఒక్కసారి పడితే శాశ్వత వైకల్యానికే ఆస్కారం ఎక్కువ. బ్రెయిన్ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తిచాలి? వైద్యుల సూచనలేంటి? లాంటి అంశాలపై ప్రత్యేక కథనం