Kadapa Women Problems In Gulf Emotional Video : ఏజెంట్ల వల్ల ఎంతో మంది మహిళలు గల్ఫ్ దేశాలలో నానా అగచాట్లు పడుతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా ఏజెంట్లు ఆగడాలు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కడపకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ మహిళ పెట్టే వేధింపులు భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీడియోను బాధితురాలు కడపకు పంపించారు. తనను కడపకు పంపించాలని మంత్రి లోకేష్‌ను ఆమె వేడుకున్నారు.