• 7 years ago
"There is a problem of s..............se for women in all areas, but I did not face such a problem." Actress Meena said.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు... హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అంశం కొన్ని నెలలుగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లు, సీనియర్ నటీమణులు మీడియాకు ఎదురుపడ్డ ప్రతీసారి ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నటి, ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రహీరోలందరితోనూ హీరోయిన్‌గా జతకట్టిన నటి మీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.
కేవలం సినిమా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా రోజుల్లోనూ కాస్టింగ్ కౌచ్ సమస్య ఉండేది. నాకు అలాంటి సమస్య ఎదురు పడలేదు కానీ ఆ రోజుల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని మీనా తెలిపారు.
మహిళలను తప్పుడు ఉద్దేశ్యంతో చూసే మగాళ్లు ఇకనైనా మారాలి. మీకూ భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. మగాళ్లలో వక్రబుద్ది పోయినపుడే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని మీనా అభిప్రాయ పడ్డారు.

Category

🗞
News

Recommended