హీరోయిన్‌కు లైంగిక వేధింపులు,మరో హీరోయిన్‌ ని కోరిక తీర్చమని డబ్బులు ఆశ

  • 6 years ago
A Actress recently filed a complaint at the T Nagar police station in Chennai, that a man made advances towards her while she was rehearsing for an event that is set to take place in Malaysia. apart from that A man from Tamil Nadu has been arrested for groping upcoming Malayalam actress when she was travelling in a train on Wednesday night.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లంటే చాలామంది బయటి వ్యక్తులకు చిన్న చూపు. డబ్బు కోసం ఏమైనా చేస్తారనే చులకన భావం. తాజాగా అమలాపాల్ విషయంలో ఇదే జరిగింది. డ్యాన్స్ స్కూల్లో రిహార్సల్స్ చేస్తున్న ఓ సమయంలో ఓ ప్రబుద్దుడు ఆమె పట్ల అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మరువకముందే మరో హీరోయిన్ కూడా లైంగిక వేధింపులకు గురవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది..
మలయాళ నటి రైల్లో ప్రయాణిస్తుండగా లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బుధవారం రాత్రి కున్నూర్‌ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్‌ అనే వ్యక్తి నిద్రిస్తున్న తనపై లైంగిక వేధిపులకు పాల్పడినట్లు మలయాళ నటి తెలిపారు.
రిసూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం సనూషా మీడియాతో మాట్లాడారు. 'నేను నా బెర్త్ పై పడుకుని ఉన్న సమయంలో.. ఎవరో నా పెదాల్ని తాకినట్లుగా అనిపించింది. తలతిప్పి చూసేసరికి.. ముందు బెర్త్ లో ఉన్న వ్యక్తి అసభ్యంగా తన పెదాల్ని తాకుతున్నట్లు అర్థమైంది. వెంటనే రైల్లో లైట్ ఆన్ చేసి.. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను ' అని నటి చెప్పారు
ఈరోజుల్లో సోషల్ మీడియాలో మాత్రమే అందరూ ఎక్కువగా స్పందిస్తున్నారని, కానీ సంఘటన జరిగిన చోట ఎవరి నుంచి స్పందన ఉండటం లేదని సనూషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చట్టబద్దంగా ఎలా వ్యవహరించాలో తనకు తెలుసు అని, తన ఫ్యామిలీ అంతా తనకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.