AGRIGOLD VICTIMS PROTEST : అగ్రిగోల్డ్ బాధితులు మళ్లీ నిరసన బాట పట్టారు. విజయవాడలో ధర్నాచౌక్లో "మహా విజ్ఞాపన దీక్ష"కు దిగారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. 9 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.