Amaravati Drone Summit 2024 : వినీలాకాశంలో కనువిందు చేసే విన్యాసాలు, శాస్త్ర సాంకేతికతకు సవాలు విసిరే ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్స్ సమర్థ వినియోగానికి బీజం వేసే నిర్ణయాలు ఇలా బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునే డ్రోన్ సమ్మిట్‌కు అమరావతి సిద్ధమవుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. పున్నమిఘాట్ వద్ద 5,000ల పైగా డ్రోన్ లతో మెగా షో ప్రత్యేక ఆకర్షణ కానుంది.